కురాన్ - 33:49 సూరా సూరా అహ్‌జాబ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

49
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا نَكَحۡتُمُ ٱلۡمُؤۡمِنَٰتِ ثُمَّ طَلَّقۡتُمُوهُنَّ مِن قَبۡلِ أَن تَمَسُّوهُنَّ فَمَا لَكُمۡ عَلَيۡهِنَّ مِنۡ عِدَّةٖ تَعۡتَدُّونَهَاۖ فَمَتِّعُوهُنَّ وَسَرِّحُوهُنَّ سَرَاحٗا جَمِيلٗا

Transliteration: (Yaaa aiyuhal lazeena aamanooo izaa nakahtumul mu'minaati summa tallaqtu moohunna min qabli an tamas soohunna famaa lakum 'alaihinna min 'iddatin ta'taddoonahaa famatti'oohunna wa sarri hoohunna saraahan jameelaa)

ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహమాడి, తరువాత - మీరు వారిని తాకక పూర్వమే - వారికి విడాకులిచ్చినట్లైతే, మీ కొరకు వేచి వుండే వ్యవధి (ఇద్దత్) పూర్తి చేయమని అడిగే హక్కు మీకు వారిపై లేదు.[1] కనుక వారికి పారితోషికం ఇచ్చి, మంచితనంతో వారిని సాగనంపండి.[2]

సూరా సూరా అహ్‌జాబ్ ఆయత 49 తఫ్సీర్




[1] వివాహం తరువాత స్త్రీతో సంభోగించి ఉంటే ఆమె వేచిఉండే గడువు ('ఇద్దత్) మూడు రుతుస్రావాలు. చూడండి, 2:228. కాని వివాహం తరువాత సంభోగించక ముందే విడాకులిస్తే ఆమె వేచిఉండక వెంటనే, మరొకనితో వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ సంభోగం జరుగకముందే భర్త చనిపోతే 'ఇద్దత్ నాలుగు నెలల మీద పది రోజులు, (ఫ'త్హ్ అల్-ఖదీర్, ఇబ్నె-కసీ'ర్). నికా'హ్ జరిగిన తరువాతనే 'తలాఖ్, ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. నికా'హ్ యే కాకుంటే 'తలాఖ్ ఇవ్వవలసిన అవసరం ఎక్కడ ఉంటుంది! "లా'తలాఖ ఖబ్ ల నికా'హ్." (ఇబ్నె-మాజా): "లా 'తలాఖ లి ఇబ్ని ఆదమ్ ఫీమా లా యమ్ లికు." (అబూ-దావూద్, తిర్మిజీ' మరియు అ'హ్మద్ - 2/189) అంటే పెండ్లి (నికా'హ్) కానిదే 'తలాఖ్ విషయమే రాదు. [2] అంటే వారి మహ్ర్ నిర్ణయించబడి ఉంటే సగం ఇవ్వండి. లేకపోతే మీకు తోటినది ఇచ్చి మంచివిధంగా సాగనంపండి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now