కురాన్ - 33:6 సూరా సూరా అహ్‌జాబ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

6
ٱلنَّبِيُّ أَوۡلَىٰ بِٱلۡمُؤۡمِنِينَ مِنۡ أَنفُسِهِمۡۖ وَأَزۡوَٰجُهُۥٓ أُمَّهَٰتُهُمۡۗ وَأُوْلُواْ ٱلۡأَرۡحَامِ بَعۡضُهُمۡ أَوۡلَىٰ بِبَعۡضٖ فِي كِتَٰبِ ٱللَّهِ مِنَ ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُهَٰجِرِينَ إِلَّآ أَن تَفۡعَلُوٓاْ إِلَىٰٓ أَوۡلِيَآئِكُم مَّعۡرُوفٗاۚ كَانَ ذَٰلِكَ فِي ٱلۡكِتَٰبِ مَسۡطُورٗا

Transliteration: (An-Nabiyyu awlaa bil mu'mineena min anfusihim wa azwaajuhoo ummahatuhum wa ulul arhaami ba'duhum awlaa biba'din fee Kitaabil laahi minal mu'meneena wal Muhaajireena illaaa an taf'alooo ilaaa awliyaaa'ikum ma'roofaa; kaana zaalika fil kitaabi mastooraa)

విశ్వాసులకు (ముస్లింలకు), దైవప్రవక్త స్వయంగా తమ కంటే కూడా ముఖ్యుడు.[1] మరియు అతని భార్యలు వారికి తల్లులు.[2] అల్లాహ్ గ్రంథం ప్రకారం రక్తసంబంధీకులు - ఇతర విశ్వాసుల మరియు వలస వచ్చిన వారి (ముహాజిరీన్) కంటే - ఒకరి కొకరు ఎక్కువగా పరస్పర సంబంధం (హక్కులు) గలవారు. కాని! మీరు మీ స్నేహితులకు మేలు చేయగోరితే (అది వేరే విషయం)![3] వాస్తవానికి ఇదంతా గ్రంథంలో వ్రాయబడి వుంది.

సూరా సూరా అహ్‌జాబ్ ఆయత 6 తఫ్సీర్




[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'నేను, మీకు మీ తండ్రులకంటే, మీ సంతానం కంటే మరియు సర్వమానవుల కంటే ఎక్కువ ప్రీతిపాత్రుడనయ్యేంత వరకు మీరు నిజమైన విశ్వాసులు కాజాలరు!' (బు'ఖారీ ముస్లిం) - అనస్ (ర'ది.'అ.) కథనం. [2] దైవప్రవక్త ('స'అస) భార్యలు (ర'ది. 'అన్హుమ్ లు) ముస్లింల తల్లుల వంటి వారు. కాబట్టి ఈ ఆయత్ శాసనం ప్రకారం దైవప్రవక్త మరణం తరువాత, వారిని ఎవ్వరూ వివాహమాడరాదు. ఇంకా చూడండి 8:75. అందులో విశ్వాసుల పరస్పర సహోదరత్వం తెలుపబడింది. మరియు ఈ ఆయత్ లో ఒక విశ్వాసునికి, దైవప్రవక్త ('స'అస) మరియు అతని భార్యలు (ర'ది. 'అన్హుమ్ లు), తల్లిదండ్రుల వంటి వారు అని తెలుపబడింది.. [3] చూడండి, 49:10 మరియు 8:75 దగ్గరి బంధువులు తప్ప ఇతరులు వారసులు కాలేరు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now