Transliteration: (Yaaa ayyuhal lazeena aamanoo laa taqooloo raa'inaa wa qoolun zurnaa wasma'oo; wa lilkaafireena 'azaabun aleem)
ఓ విశ్వాసులారా, (మీరు ప్రవక్తతో మాట్లాడేటప్పుడు) రా'ఇనా! అని అనకండి. ఉన్"జుర్నా! అని (గౌరవంతో) అనండి[1] మరియు (అతని మాటలను) శ్రద్ధతో వినండి. మరియు సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష గలదు.
సూరా సూరా బకరా ఆయత 104 తఫ్సీర్
[1] రా'ఇనా: అంటే, Be careful; Listen to us, we lsiten to you. ఆగండి! మా మాట వినండి, మేము మీ మాట వింటాము, అని అర్థం. కాని యూదులు ఈ పదాన్ని తమ నాలుకలను త్రిప్పి, హీబ్రూ భాషలో, 'రా'ఈనా' - మా పశువుల కాపరి, లేక మూర్ఖుడు అనే అర్థం ఇచ్చే దురుద్దేశంతో పలికి తమ కక్ష తీర్చుకునేవారు. కాబట్టి విశ్వాసులతో: మీరు 'ఉన్ జుర్ నా' అంటే 'మమ్మల్ని అర్థం చేసుకోనివ్వండి.'అని గౌరవంతో, అనమని ఆజ్ఞ ఇవ్వబడుతోంది. ఇదే విధంగా యూదులు 'అస్సలాము అలైకుమ్' (మీకు శాంతి కలుగు గాక!) అనే మాటను నాలుకలు త్రిప్పి 'అస్సాము అలైకుమ్' (మీకు చావు వచ్చు గాక!) అనే అర్థంలో వాడేవారు. ఇంకా చూడండి, ఖు. 4:46.
×
Download Our Quran App
For a faster and smoother experience, install our mobile app now.
సూరా సూరా బకరా ఆయత 104 తఫ్సీర్