కురాన్ - 2:246 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

246
أَلَمۡ تَرَ إِلَى ٱلۡمَلَإِ مِنۢ بَنِيٓ إِسۡرَـٰٓءِيلَ مِنۢ بَعۡدِ مُوسَىٰٓ إِذۡ قَالُواْ لِنَبِيّٖ لَّهُمُ ٱبۡعَثۡ لَنَا مَلِكٗا نُّقَٰتِلۡ فِي سَبِيلِ ٱللَّهِۖ قَالَ هَلۡ عَسَيۡتُمۡ إِن كُتِبَ عَلَيۡكُمُ ٱلۡقِتَالُ أَلَّا تُقَٰتِلُواْۖ قَالُواْ وَمَا لَنَآ أَلَّا نُقَٰتِلَ فِي سَبِيلِ ٱللَّهِ وَقَدۡ أُخۡرِجۡنَا مِن دِيَٰرِنَا وَأَبۡنَآئِنَاۖ فَلَمَّا كُتِبَ عَلَيۡهِمُ ٱلۡقِتَالُ تَوَلَّوۡاْ إِلَّا قَلِيلٗا مِّنۡهُمۡۚ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلظَّـٰلِمِينَ

Transliteration: (Alam tara ilal malai mim Baneee Israaa'eela mim ba'di Moosaaa iz qaaloo li Nabiyyil lahumub 'as lanaa malikan nuqaatil fee sabeelillaahi qaala hal 'asaitum in kutiba 'alaikumul qitaalu allaa tuqaatiloo qaaloo wa maa lanaaa allaa nuqaatila fee sabeelil laahi wa qad ukhrijnaa min diyaarinaa wa abnaaa'inaa falammaa kutiba 'alaihimul qitaalu tawallaw illaa qaleelam minhum; wallaahu 'aleemum bizzaalimeen)

ఏమీ? మూసా (నిర్యాణం) తరువాత ఇస్రాయీలు సంతతి నాయకులు, తమ ఒక ప్రవక్తతో: "నీవు మా కొరకు ఒక రాజును నియమించు, మేము అల్లాహ్ మార్గంలో యుద్ధం (జిహాద్) చేస్తాము." అని పలికిన సంగతి నీకు తెలియదా? [1] దానికి అతను: "ఒకవేళ యుద్ధం చేయమని ఆదేశిస్తే, మీరు యుద్ధం చేయటానికి నిరాకరించరు కదా? అని అన్నాడు. దానికి వారు: "మేము మరియు మా సంతానం, మా ఇండ్ల నుండి గెంటివేయ బడ్డాము కదా! అలాంటప్పుడు మేము అల్లాహ్ మార్గంలో ఎందుకు యుద్ధం చేయము?" అని జవాబిచ్చారు. కాని యుద్ధం చేయండని ఆజ్ఞాపించగానే, వారిలో కొందరు తప్ప, అందరూ వెన్ను చూపారు. మరియు అల్లాహ్ కు ఈ దుర్మార్గులను గురించి బాగా తెలుసు.

సూరా సూరా బకరా ఆయత 246 తఫ్సీర్




[1] ఇక్కడ ప్రవక్త ఉండగా; బనీ ఇస్రాయీ'ల్ వారు, తమ ప్రవక్త సామ్యూల్ (అ.స.)తో: "మాకొక రాజును నియమించు." అని అడగటం, అల్లాహుతా'ఆలాకు అంగీకారమైనదే కాబట్టి ఖుర్ఆన్ లో పేర్కొనబడింది. కాని అట్టి రాజు దైవభీతి గలవాడు, న్యావంతుడు అయితే, అది ధర్మసమ్మతమే కాక వాంఛనీయం కూడాను. చూడండి, 5:20

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now