కురాన్ - 2:269 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

269
يُؤۡتِي ٱلۡحِكۡمَةَ مَن يَشَآءُۚ وَمَن يُؤۡتَ ٱلۡحِكۡمَةَ فَقَدۡ أُوتِيَ خَيۡرٗا كَثِيرٗاۗ وَمَا يَذَّكَّرُ إِلَّآ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ

Transliteration: (Yu'til Hikmata mai yashaaa'; wa mai yu'tal Hikmata faqad ootiya khairan kaseeraa; wa maa yazzakkaru illaaa ulul albaab)

ఆయన తాను కోరిన వారికి వివేకాన్ని ప్రసాదిస్తాడు[1]. మరియు వివేకం పొందిన వాడు, వాస్తవంగా సర్వసంపదలను పొందిన వాడే! కాని బుద్ధిమంతులు తప్ప వేరేవారు దీనిని గ్రహించలేరు.

సూరా సూరా బకరా ఆయత 269 తఫ్సీర్




[1] 'హిక్మతున్: అంటే, వివేకం, తెలివి, జ్ఞానం, సూక్ష్మబుద్ధి, నేర్పు, ప్రపంచజ్ఞానం మొదలైనవి అని అర్థం. ఇక్కడ ఖుర్ఆన్ ను మరియు దైవప్రవక్త ('స'అస) సంప్రదాయాలను అర్థం చేసుకొని, వాటి ప్రకారం నడచుకోవటం అని అర్థం. ఇద్దరు వ్యక్తులతో ఈర్ష్య పడవచ్చు. 1) అల్లాహ్ (సు.తా.) ధనం ప్రసాదించగా, అతడు దానిని అల్లాహుతా'ఆలా మార్గంలో ఖర్చు చేసేవాడు. 2) అల్లాహ్ (సు.తా.) వివేకం ప్రసాదించగా, అతడు దానితో న్యాయమైన తీర్పు చేసేవాడు మరియు ఇతరులకు దానిని బోధించేవాడు, ('స. బు'ఖారీ, కితాబ్ అల్ 'ఇల్మ్ వల్ 'హిక్మహ్).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now