కురాన్ - 2:87 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

87
وَلَقَدۡ ءَاتَيۡنَا مُوسَى ٱلۡكِتَٰبَ وَقَفَّيۡنَا مِنۢ بَعۡدِهِۦ بِٱلرُّسُلِۖ وَءَاتَيۡنَا عِيسَى ٱبۡنَ مَرۡيَمَ ٱلۡبَيِّنَٰتِ وَأَيَّدۡنَٰهُ بِرُوحِ ٱلۡقُدُسِۗ أَفَكُلَّمَا جَآءَكُمۡ رَسُولُۢ بِمَا لَا تَهۡوَىٰٓ أَنفُسُكُمُ ٱسۡتَكۡبَرۡتُمۡ فَفَرِيقٗا كَذَّبۡتُمۡ وَفَرِيقٗا تَقۡتُلُونَ

Transliteration: (Wa laqad aatainaa Moosal Kitaaba wa qaffainaa mim ba'dihee bir Rusuli wa aatainaa 'Eesab-na-Maryamal baiyinaati wa ayyadnaahu bi Roohil Qudus; afakullamaa jaaa'akum Rasoolum bimaa laa tahwaaa anfusukumus takbartum fafareeqan kazzabtum wa fareeqan taqtuloon)

మరియు వాస్తవంగా మేము మూసాకు గ్రంథాన్ని (తౌరాత్ ను) ప్రసాదించాము మరియు అతని తర్వాత వరుసగా ప్రవక్తలను పంపాము. మరియు మర్యమ్ కుమారుడైన ఈసాకు (ఏసుకు) స్పష్టమైన సూచనలను ఇచ్చాము[1] మరియు పరిశుద్ధాత్మ (రూహుల్ ఖుదుస్) తో అతనిని బలపరిచాము.[2] ఏమీ? మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్న దాన్ని తీసుకుని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వస్తే, మీరు వారి పట్ల దురహంకారంతో ప్రవర్తించలేదా? వారిలో కొందరిని మీరు అసత్యవాదులన్నారు, మరి కొందరిని చంపారు.[3]

సూరా సూరా బకరా ఆయత 87 తఫ్సీర్




[1] 'ఈసా ('అ.స.)కు అల్లాహుతా'ఆలా ప్రసాదించిన అద్భుత సూచనలు: చచ్చిన వారిని బ్రతికించటం, కుష్ఠురోగులను బాగుచేయటం మరియు పుట్టుగ్రుడ్డి వారికి చూపునివ్వటం మొదలైనవి. చూడండి, 3:49. [2] పరిశుద్ధాత్మ అంటే జిబ్రీల్ ('అ.స.), (ఫ'త్హ అల్ - బయాన్, ఇబ్నె-కసీ'ర్ - బు'ఖారీ, ముస్లిం, (జిబ్రీల్ 'అ.స.) సమర్థన కొరకు అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించారు. [3] 'ఈసా ('అ.స.)ను అబద్ధీకుడన్నారు. 'జకరియ్యా మరియు య'హ్యా ('అలైహిమ్ స.)లను చంపారు, (ము'హమ్మద్ జూనాగఢి). ఇంకా చూడండి, 2:61, వ్యాఖ్యానం 1.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now