కురాన్ - 48:25 సూరా సూరా ఫత్హ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

25
هُمُ ٱلَّذِينَ كَفَرُواْ وَصَدُّوكُمۡ عَنِ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ وَٱلۡهَدۡيَ مَعۡكُوفًا أَن يَبۡلُغَ مَحِلَّهُۥۚ وَلَوۡلَا رِجَالٞ مُّؤۡمِنُونَ وَنِسَآءٞ مُّؤۡمِنَٰتٞ لَّمۡ تَعۡلَمُوهُمۡ أَن تَطَـُٔوهُمۡ فَتُصِيبَكُم مِّنۡهُم مَّعَرَّةُۢ بِغَيۡرِ عِلۡمٖۖ لِّيُدۡخِلَ ٱللَّهُ فِي رَحۡمَتِهِۦ مَن يَشَآءُۚ لَوۡ تَزَيَّلُواْ لَعَذَّبۡنَا ٱلَّذِينَ كَفَرُواْ مِنۡهُمۡ عَذَابًا أَلِيمًا

Transliteration: (Humul lazeena kafaroo wa saddookum 'anil-Masjidil-Haraami walhadya ma'koofan any yablugha mahillah; wa law laa rijaalum mu'minoona wa nisaaa'um mu'minaatul lam ta'lamoohum an tata'oohum fatuseebakum minhum ma'arratum bighairi 'ilmin liyud khilal laahu fee rahmatihee many yashaaa'; law tazayyaloo la'azzabnal lazeena kafaroo minhum 'azaaban aleema)

(వాస్తవానికి) సత్యాన్ని తిరస్కరించి, మిమ్మల్ని మస్జిద్ అల్ హరామ్ కు పోకుండా నిరోధించి, బలి (ఖుర్బానీ) జంతువులను వాటిని బలి చేసే స్థలానికి చేరనివ్వకుండా ఆపింది వారే కదా![1] ఒకవేళ వారిలో విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు లేకుంటే - ఎవరిని గురించైతే మీకు తెలియదో - వారిని మీరు త్రొక్కివేసి ఉండేవారు. దాని వలన మీరు - మీకు తెలియకుండానే - పాపానికి గురి అయ్యేవారు. అల్లాహ్ తాను కోరిన వారిని తన కారుణ్యంలోనికి తీసుకుంటాడు. ఒకవేళ వారు (విశ్వాసులు) వారి నుండి వేరుగా ఉండి ఉంటే, మేము తప్పక వారిలోని సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష విధించి ఉండేవారము.

సూరా సూరా ఫత్హ్ ఆయత 25 తఫ్సీర్




[1] అల్-హద్ య: అంటే మక్కాకు 'ఉమ్రా లేక 'హజ్జ్ కొరకు పోయేవారు, అక్కడ బలి ఇచ్చే పశువు. వారు దానిని తమ వెంట తీసుకురావచ్చు లేదా అక్కడే కొనవచ్చు. మ'హిల్లున్: అంటే ఖుర్బానీ (బలి) ఇచ్చే చోటు. ఇది 'హరం సరిహద్దులలోని భాగం ('హుదూద్ అల్-'హరం).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now