కురాన్ - 25:65 సూరా సూరా ఫుర్కాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

65
وَٱلَّذِينَ يَقُولُونَ رَبَّنَا ٱصۡرِفۡ عَنَّا عَذَابَ جَهَنَّمَۖ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا

Transliteration: (Wallazeena yaqooloona Rabbanas rif 'annaa 'azaaba Jahannama inna 'azaabahaa kaana gharaamaa)

మరియు ఎవరైతే: "ఓ మా ప్రభూ! మా నుండి నరకపు శిక్షను తొలగించు. నిశ్చయంగా, దాని శిక్ష ఎడతెగని పీడన" అని అంటారో![1]

సూరా సూరా ఫుర్కాన్ ఆయత 65 తఫ్సీర్




[1] చూవారే అనంతకరుణామయునికి ప్రియులైనవారు ఎవరైతే నమా'జ్ చేస్తారో, విధిదానం ('జకాత్) ఇస్తారో, సత్కార్యాలు చేస్తారో మరియు తమ ప్రభువును రేయింబవళ్ళు నరకపు శిక్ష నుండి తొలగించమని ప్రార్థిస్తారో! అంటే అల్లాహ్ (సు.తా.) ఆరాధన చేస్తూ ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తూ ఉండి కూడా, దానికై గర్వితులు కారో మరియు సదా తమ ప్రభువు శిక్ష నుండి భీతిపరులై ఉంటారో, అలాంటి వారు! ఇంకా చూడండి, 23:60.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now