కురాన్ - 57:3 సూరా సూరా హదీద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

3
هُوَ ٱلۡأَوَّلُ وَٱلۡأٓخِرُ وَٱلظَّـٰهِرُ وَٱلۡبَاطِنُۖ وَهُوَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٌ

Transliteration: (Huwal Awwalu wal'Aakhiru waz Zaahiru wal Baatinu wa huwa bikulli shai'in Aleem)

ఆయనే ప్రథమం మరియు ఆయనే అంతం[1] మరియు ఆయనే ప్రత్యక్షుడు మరియు ఆయనే పరోక్షుడు.[2] మరియు ఆయనే ప్రతిదాని గురించి జ్ఞానం గలవాడు.

సూరా సూరా హదీద్ ఆయత 3 తఫ్సీర్




[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'కాలం, అనేది మానవుని జ్ఞానపరిధికి మించినది, కాని దానిని అల్లాహ్ (సు.తా.) సృష్టించాడు.' [2] ప్రతి వస్తువు చివరకు అల్లాహ్ (సు.తా.) వద్దకు మాత్రమే చేరుతుంది. ఎందుకంటే ఆయన (సు.తా.) ప్రతిదానికి మూలం. ఆయన ప్రతిదానికి - మరే ఇతర దానికంటే - తన జ్ఞానపరంగా సమీపంలో ఉన్నాడు. అల్-అవ్వలు: The First, ప్రథముడు, మొట్ట మొదట వాడు, ఆద్యుడు, సర్వసృష్టిరాసుల సృష్టికి పూర్వమే ఉన్నవాడు. అల్-ఆఖరు: The Last, The End. అంతం, కడపటి, చివరికి మిగిలే వాడు, సర్వసృష్టిరాసుల వినాశం తరువాత కూడా ఉండేవాడు. అజ్-'జాహిరు: The Ascendant or Predominant, over all things, The Outward. ప్రత్యక్షుడు, గోచరుడు, బాహ్యం. అల్-బాతిను: He who knows the secret and hidden things. He who is veiled from the eyes and imaginations of created beings. పరోక్షకుడు, అగోచరుడు, దృష్టికి గోచరించని, గోప్యమైన, మరగైనవాడు. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now