కురాన్ - 17:33 సూరా సూరా బనీ ఇస్రాయీల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

33
وَلَا تَقۡتُلُواْ ٱلنَّفۡسَ ٱلَّتِي حَرَّمَ ٱللَّهُ إِلَّا بِٱلۡحَقِّۗ وَمَن قُتِلَ مَظۡلُومٗا فَقَدۡ جَعَلۡنَا لِوَلِيِّهِۦ سُلۡطَٰنٗا فَلَا يُسۡرِف فِّي ٱلۡقَتۡلِۖ إِنَّهُۥ كَانَ مَنصُورٗا

Transliteration: (Wa laa taqtulun nafsal latee harramal laahu illaa bilhaqq; wa man qutila mazlooman faqad ja'alnaa liwaliyyihee sultaanan falaa yusrif fil qatli innahoo kaana mansooraa)

న్యాయానికి తప్ప, అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడా చంపకండి.[1] ఎవడు అన్యాయంగా చంపబడతాడో, మేము అతని వారసునికి (ప్రతీకార) హక్కు ఇచ్చి ఉన్నాము.[2] కాని అతడు హత్య (ప్రతీకార) విషయంలో హద్దులను మీరకూడదు. నిశ్చయంగా, అతనికి (ధర్మప్రకారం) సహాయ మొసంగబడుతుంది.

సూరా సూరా బనీ ఇస్రాయీల్ ఆయత 33 తఫ్సీర్




[1] చూడండి, 2:190. అంటే, ధర్మయుద్ధంలో గానీ లేక న్యాయ ప్రతీకారానికి గానీ, లేక ఆత్మరక్షణకు గానీ కాకుండా, అన్యాయంగా ఏ ప్రాణిని కూడా చంపరాదు. [2] అల్-ఖి'సా'సు: న్యాయ ప్రతీకారం. చూడండి, 2:178. ఇక్కడ వలీ అంటే రక్తసంబంధీకుడైన దగ్గర బంధువు అని అర్థం.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now