కురాన్ - 17:73 సూరా సూరా బనీ ఇస్రాయీల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

73
وَإِن كَادُواْ لَيَفۡتِنُونَكَ عَنِ ٱلَّذِيٓ أَوۡحَيۡنَآ إِلَيۡكَ لِتَفۡتَرِيَ عَلَيۡنَا غَيۡرَهُۥۖ وَإِذٗا لَّٱتَّخَذُوكَ خَلِيلٗا

Transliteration: (Wa in kaadoo la yaftinoonaka 'anil lazeee awhainaaa ilaika litaftariya 'alainaaa ghairahoo wa izallat takhazooka khaleelaa)

మరియు (ఓ ప్రవక్తా!) మేము నీపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం (వహీ) నుండి నిన్ను మరలించి, నీవు అదికాక మా పేరుతో మరొక దానిని (సందేశాన్ని) కల్పించాలని నిన్ను పురికొల్పటానికి వారు ప్రయత్నిస్తున్నారు.[1] నీవు అలా చేసి ఉంటే వారు తప్పకుండా నిన్ను తమ ఆప్తమిత్రులుగా చేసుకునేవారు.

సూరా సూరా బనీ ఇస్రాయీల్ ఆయత 73 తఫ్సీర్




[1] ఇది ముష్రిక్ ఖురైషులు దైవప్రవక్త ('స'అస) ముందు పెట్టిన మరొక ప్రస్తావన. అంటే అతను వారి కల్పిత దైవాలను నిజమైన దైవాలని గుర్తిస్తే వారు కూడా అతనిని దైవప్రవక్తగా గుర్తిస్తామని పెట్టిన షరతు. దానిని అతను ('స'అస) నిరాకరించారు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now