కురాన్ - 17:80 సూరా సూరా బనీ ఇస్రాయీల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

80
وَقُل رَّبِّ أَدۡخِلۡنِي مُدۡخَلَ صِدۡقٖ وَأَخۡرِجۡنِي مُخۡرَجَ صِدۡقٖ وَٱجۡعَل لِّي مِن لَّدُنكَ سُلۡطَٰنٗا نَّصِيرٗا

Transliteration: (Wa qur Rabbi adkhilnee mudkhala sidqinw wa akhrijnee mukhraja sidqinw waj'al lee milladunka sultaanan naseeraa)

మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నీవు నా ప్రతి ప్రవేశాన్ని, సత్యప్రవేశంగా చేయి మరియు నా బహిర్గమనాన్ని కూడా సత్య బహిర్గమనంగా చేయి మరియు నీ వైపు నుండి నాకు అధికార శక్తిని, సహాయాన్ని ప్రసాదించు."[1]

సూరా సూరా బనీ ఇస్రాయీల్ ఆయత 80 తఫ్సీర్




[1] కొందరు వ్యాఖ్యాతలు ఈ ఆయత్ ప్రస్థానం (హిజ్రత్) సమయంలో అవతరింపజేయ బడిందని అంటారు. అంటే యస్'రిబ్ (మదీనా మునవ్వరా) ప్రవేశాన్ని మరియు మక్కా ముకర్రమా బహిర్గమనాన్ని సత్యమైనవి చేయమని దైవప్రవక్త ('స'అస) ప్రార్థిస్తున్నారు. మరికొందరు అంటారు: నన్ను సత్యం మీద మరణింపజేయి మరియు సత్యంతో పునరుత్థరింపజేయి. ఇమామ్ షౌకాని అంటారు: ఈ అన్నీ అర్థాలు కూడా సమంజసమైనవే, ఎందుకంటే ఇది ఒక దు'ఆ.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now