కురాన్ - 23:51 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

51
يَـٰٓأَيُّهَا ٱلرُّسُلُ كُلُواْ مِنَ ٱلطَّيِّبَٰتِ وَٱعۡمَلُواْ صَٰلِحًاۖ إِنِّي بِمَا تَعۡمَلُونَ عَلِيمٞ

Transliteration: (Yaaa aiyuhar Rusulu kuloo minat taiyibaati wa'maloo saalihan innee bimaa ta'maloona 'Aleem)

ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వస్తువులనే తినండి మరియు సత్కార్యాలు చేయండి.[1] నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు.

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 51 తఫ్సీర్




[1] అ'త్తయ్యిబాతు: అంటే పరిశుద్ధ వస్తువులు. కొందరు వ్యాఖ్యాతలు వీటిని 'హలాల్ వస్తువులు అని అన్నారు. రెండూ సరైనవే. ఎందుకంటే ప్రతి పరిశుద్ధ వస్తువు 'హలాలే! అందుకే అల్లాహ్ (సు.తా.) అపరిశుద్ధ వస్తువులను 'హరాం చేశాడు. అ'అమాల్ 'సాలిహ్: సత్కార్యాలు అంటే ఏ కార్యాలైతే ఖుర్ఆన్ మరియు 'స'హీ'హ్ 'హదీస్'ల ప్రకారం ఉంటయో! ఈ రెంటి మధ్య గాఢమైన సంబంధముంది. కావున వీటిని గురించి ప్రవక్తలందరికీ బోధింపబడింది. అందుకే ప్రవక్తలందరూ తాము పని చేసి సంపాదించిన సంపాదన నుండే తినేవారు. చాలా మంది ప్రవక్తలు కొంతకాలం గొర్ల కాపరులుగా పనిచేశారు, (బు'ఖారీ). ప్రవక్తలందరూ పురుషులే!

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now