కురాన్ - 16:106 సూరా సూరా నహల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

106
مَن كَفَرَ بِٱللَّهِ مِنۢ بَعۡدِ إِيمَٰنِهِۦٓ إِلَّا مَنۡ أُكۡرِهَ وَقَلۡبُهُۥ مُطۡمَئِنُّۢ بِٱلۡإِيمَٰنِ وَلَٰكِن مَّن شَرَحَ بِٱلۡكُفۡرِ صَدۡرٗا فَعَلَيۡهِمۡ غَضَبٞ مِّنَ ٱللَّهِ وَلَهُمۡ عَذَابٌ عَظِيمٞ

Transliteration: (man kafara billaahi mim ba'di eemaanihee illaa man ukriha wa qalbuhoo mutmma'innum bil eemaani wa laakim man sharaha bilkufri sadran fa'alaihim ghadabum minal laahi wa lahum 'azaabun 'azeem)

ఎవడైతే విశ్వసించిన తరువాత, అల్లాహ్ ను తిరస్కరిస్తాడో - తన హృదయం సంతృప్తికరమైన విశ్వాసంతో నిండి ఉండి, బలవంతంగా తిరస్కరించేవాడు తప్ప![1] - మరియు ఎవరైతే హృదయపూర్వకంగా సత్యతిరస్కారానికి పాల్పడతారో, అలాంటి వారిపై అల్లాహ్ ఆగ్రహం (దూషణ) విరుచుకు పడుతుంది. మరియు వారి కొరకు ఘోరమైన శిక్ష ఉంటుంది.

సూరా సూరా నహల్ ఆయత 106 తఫ్సీర్




[1] తన హృదయంలో దృఢవిశ్వాసం ఉండి - కేవలం సత్యతిరస్కారుల శిక్షకు తాళలేక - తనను తాను సత్యతిరస్కారిగా చెప్పుకునే వాడిపై ఎట్టి నిందలేదు. ఇస్లాం కొరకు చంపబడటం ఎంతో గొప్ప పుణ్యకార్యం. అయినా ఖుర్ఆన్ లో అనేక చోట్లలో: 'అల్లాహ్ (సు.తా.) మానవునిపై అతని శక్తికి మించిన భారం వేయడు.' అని చెప్పబడింది. చూడండి, 2:233, 286; 6:152, 7:42, 23:62 వగైరా. కావున ఈ విడుదల ఇవ్వబడింది.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now