కురాన్ - 24:22 సూరా సూరా నూర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

22
وَلَا يَأۡتَلِ أُوْلُواْ ٱلۡفَضۡلِ مِنكُمۡ وَٱلسَّعَةِ أَن يُؤۡتُوٓاْ أُوْلِي ٱلۡقُرۡبَىٰ وَٱلۡمَسَٰكِينَ وَٱلۡمُهَٰجِرِينَ فِي سَبِيلِ ٱللَّهِۖ وَلۡيَعۡفُواْ وَلۡيَصۡفَحُوٓاْۗ أَلَا تُحِبُّونَ أَن يَغۡفِرَ ٱللَّهُ لَكُمۡۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٌ

Transliteration: (Wa laa yaatali ulul fadli minkum wassa'ati ai yu'tooo ulil qurbaa walmasaakeena walmuhaajireena fee sabeelillaahi walya'foo walyasfahoo; alaa tuhibboona ai yaghfiral laahu lakum; wal laahu Ghafoorur Raheem)

మరియు మీలో (అల్లాహ్) అనుగ్రహం మరియు సమృద్ధిగా (సంపదలు) గలవారు, తమ బంధువులకు, పేదలకు [1], అల్లాహ్ మార్గంలో వలస (హిజ్రత్) పోయే వారికి, సహాయం చేయమని ప్రతిజ్ఞ చేయరాదు [2]. వారిని మన్నించాలి, (వారి తప్పులను) ఉపేక్షించాలి. ఏమీ? అల్లాహ్ మీ తప్పులను క్షమించాలని మీరు కోరరా? వాస్తవానికి అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

సూరా సూరా నూర్ ఆయత 22 తఫ్సీర్




[1] మిస్కీనున్: తన ఆదాయం నిత్యావసరాలకు సరిపోకున్నా ఇతరులను యాచించనివాడు. [2] 'ఆయి'షహ్ (ర.'అన్హా) పై అపనింద మోపిన విశ్వాసులలో ఒకడు మిస్'తహ్ (ర'.ది.'అ.), అబూ బక్ర్ (ర.'ది.'అ.) యొక్క దగ్గరి బంధువు. అబూ బక్ర్ (ర.'ది.'అ.) అతనికి సహాయం చేసేవారు. 'ఆయి'షహ్ (ర.'ది.'అన్హా) ను అపనింద నుండి విముక్తి కలిగించే ఆయతులు అవతరింపజేయబడిన తరువాత అబూ బక్ర్ (ర.'ది.'అ.) మి'స్'తహ్ (ర'ది.'అ.) కు ఇక ఎలాంటి సహాయం చేయనని ప్రతిజ్ఞ చేస్తారు. అది అల్లాహ్ (సు.తా.)కు నచ్చక ఈ ఆయత్ అవతరింపజేశాడు. అప్పుడు అబూ బక్ర్ (ర.'ది.'అ.) తన ప్రతిజ్ఞకు పరిహారం (కఫ్ఫారహ్) చెల్లించి మి'స్'తహ్ (ర'ది.'అ) కు మరల సహాయం చేయసాగారు. (ఇబ్నె-కసీ'ర్, ఫ'త్హ్ అల్-ఖదీర్), చూడండి, 13:22.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now