కురాన్ - 61:6 సూరా సూరా సఫ్ఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

6
وَإِذۡ قَالَ عِيسَى ٱبۡنُ مَرۡيَمَ يَٰبَنِيٓ إِسۡرَـٰٓءِيلَ إِنِّي رَسُولُ ٱللَّهِ إِلَيۡكُم مُّصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيَّ مِنَ ٱلتَّوۡرَىٰةِ وَمُبَشِّرَۢا بِرَسُولٖ يَأۡتِي مِنۢ بَعۡدِي ٱسۡمُهُۥٓ أَحۡمَدُۖ فَلَمَّا جَآءَهُم بِٱلۡبَيِّنَٰتِ قَالُواْ هَٰذَا سِحۡرٞ مُّبِينٞ

Transliteration: (Wa iz qaala 'Eesab-nu-Maryama yaa Banee Israaa'eela innee Rasoolul laahi ilaikum musaddiqal limaa baina yadayya minat Tawraati wa mubashshiram bi Rasooliny yaatee mim ba'dis muhooo Ahmad; falammaa jaaa'ahum bil baiyinaati qaaloo haazaa sihrum mubeen)

మరియు మర్యమ్ కుమారుడు ఈసా[1] (తన జాతి వారితో) ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన అల్లాహ్ యొక్క సందేశహరుణ్ణి, నాకు పూర్వం, వచ్చి ఉన్న తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. మరియు నా తరువాత అహ్మద్[2] అనే సందేశహరుడు రాబోతున్నాడు, అనే శుభవార్తను ఇస్తున్నాను." తరువాత అతను (అహ్మద్)[3] వారి వద్దకు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినపుడు వారు ఇలా అన్నారు: "ఇది కేవలం స్పష్టమైన మంత్రజాలమే!"

సూరా సూరా సఫ్ఫ్ ఆయత 6 తఫ్సీర్




[1] ఇస్రాయీ'ల్ సంతతివారు ఏ విధంగా మూసా ('అ.స.) ఆదేశాలను ఉల్లంఘించారో! అదే విధంగా వారు 'ఈసా ('అ.స.) ను కూడా తిరస్కరించారు. అలాంటప్పుడు దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస)ను యూదులు తిరస్కరించడం క్రొత్త విషయమేమీ కాదు. వారి చరిత్ర చూస్తే వారు ఎందరో దైవప్రవక్త ('అ.స.)లను తిరస్కరించారు మరియు కొందరిని చంపారు. 'ఈసా ('అ.స.) తౌరాతును ధృవపరిచారు. [2] 'ఈసా ('అ.స.) తన తరువాత అ'హ్మద్ అనే ప్రవక్త ('స'అస) రానున్నాడు, అనే శుభవార్తను వినిపిస్తున్నారు. అతను ('స'అస) ఇలా అన్నారు : 'నేను నా తండ్రి, ఇబ్రాహీమ్ ('అ.స.) ప్రార్థన (దు'ఆ)ను మరియు 'ఈసా ('అ.స.) సూచన (బషారత్) ను' (అయ్ సర్ అత్తఫాసీర్). 'హమ్ద్ అంటే ప్రశంస (praise, laudation). అ'హ్మద్ అనే పదాన్ని దాని ఫా'ఇల్ రూపంలో తీసుకుంటే అల్లాహుతాలాను అందరికంటే అధికంగా స్తుంతేవాడు మరియు మఫ్'ఊల్ రూపంలో తీసుకుంటే అత్యధికంగా కొనియాడబడినవాడు, అనే అర్థాలు వస్తాయి. (ఫ'త్హ్ అల్-ఖదీర్). [3] హిందూ ధర్మం గ్రంథాలలో కూడా అ'హ్మద్ అనే అంతిమ ఋషి రానున్నాడని ఎన్నో చోట్లలో పేర్కొనబడింది.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now