కురాన్ - 65:1 సూరా సూరా తలాఖ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

1
يَـٰٓأَيُّهَا ٱلنَّبِيُّ إِذَا طَلَّقۡتُمُ ٱلنِّسَآءَ فَطَلِّقُوهُنَّ لِعِدَّتِهِنَّ وَأَحۡصُواْ ٱلۡعِدَّةَۖ وَٱتَّقُواْ ٱللَّهَ رَبَّكُمۡۖ لَا تُخۡرِجُوهُنَّ مِنۢ بُيُوتِهِنَّ وَلَا يَخۡرُجۡنَ إِلَّآ أَن يَأۡتِينَ بِفَٰحِشَةٖ مُّبَيِّنَةٖۚ وَتِلۡكَ حُدُودُ ٱللَّهِۚ وَمَن يَتَعَدَّ حُدُودَ ٱللَّهِ فَقَدۡ ظَلَمَ نَفۡسَهُۥۚ لَا تَدۡرِي لَعَلَّ ٱللَّهَ يُحۡدِثُ بَعۡدَ ذَٰلِكَ أَمۡرٗا

Transliteration: (Yaaa ayyuhan nabiyyu izaa tallaqtummun nisaaa'a fatalliqoohunna li'iddatihinna wa ahsul'iddata wattaqul laaha rabbakum; laa tukhri joohunna min bu-yootihinna wa laa yakhrujna illaaa any ya'teena bifaahishatim mubaiyinah; wa tilka hudoodul laah; wa many yata'adda hudoodal laahi faqad zalama nafsah; laa tadree la'allal laaha yuhdisu ba'dazaalika amraa)

ఓ ప్రవక్తా! మీరు స్త్రీలకు విడాకులు (తలాఖ్) ఇచ్చేటప్పుడు వారికి, వారి నిర్ణీత గడువు (ఇద్దత్) తో విడాకులివ్వండి. మరియు ఆ గడువును ఖచ్చితంగా లెక్కపెట్టండి[1]. మరియు మీ ప్రభువైన అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. వారు బహిరంగంగా అశ్లీల చేష్టలకు పాల్పడితే తప్ప, మీరు వారిని వారి ఇండ్ల నుండి వెడల గొట్టకండి మరియు వారు కూడా స్వయంగా వెళ్ళి పోకూడదు[2]. మరియు ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. మరియు ఎవడైతే అల్లాహ్ (నిర్ణయించిన) హద్దులను అతిక్రమిస్తాడో వాస్తవానికి వాడు తనకు తానే అన్యాయం చేసుకున్నట్లు. నీకు తెలియదు, బహుశా! దాని తరువాత అల్లాహ్ ఏదైనా క్రొత్త మార్గం చూపించవచ్చు![3]

సూరా సూరా తలాఖ్ ఆయత 1 తఫ్సీర్




[1] నిర్ణీతగడువుతో అంటే గడువు ప్రారంభం కాగల సమయంలో, నిర్ణీతగడువు లోపల ఆమెతో రాజీపడే అవకాశం ఉండేరీతిలో విడాకులివ్వాలి. ఇబ్నె ఉమర్ ('ర'ది.'అ) తన భార్యకు ఋతుస్రావంకాలం (బహిష్టు సమయం)లో విడాకులిస్తే, దైవప్రవక్త ('స'అస) క్రోధితులయ్యారు. స్త్రీలు పరిశుద్ధులుగా ఉన్నకాలంలో వారితో లైంగిక సంబంధం చేయక ముందు విడాకులివ్వాలి అని బోధించారు. ('స. బు'ఖారీ). ఇక్కడ పేర్కొన్న 'హదీస్' ఈ ఆయత్ వెలుగులో ఉంది. ఆ గడువును ఖచ్ఛితంగా లెక్కపెట్టాలి. [2] ఇద్దత్ కాలం పూర్తి అయ్యే వరకు స్త్రీలు తమ భర్త ఇంటిలోనే ఉండాలి. భర్త ఆమె అన్న వస్త్రాల ఖర్చులు భరించాలి. [3] చూఅంటే అల్లాహ్ (సు.తా.) వారి మధ్య మళ్ళీ ప్రేమ కలగించవచ్చు మరియు వారు తిరిగి తమ వివాహబంధాన్ని స్థిరపరచుకోవచ్చు! అందుకే ఒకసారి విడాకులివ్వడం ప్రోత్సహించబడింది. మరియు చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారం - ఈ ఆయత్ వెలుగులో - మూడు విడాకులు ఒకేసారి ఇవ్వడం నిషేధింపబడింది. ఎందుకంటే మొదటి మరియు రెండవ విడాకు తరువాత వివాహాన్ని తిరిగి స్థిరపరచుకోవచ్చు! (ఫ'త్హ్ అల్ ఖదీర్). ఒక స్త్రీకి అంతకు ముందు రెండువిడాకులివ్వబడి ఆ తరువాత మూడవవిడాకు ఇస్తే! అప్పుడు ఆమె తన భర్త ఇంట్లో ఉండజాలదు. మరియు అలాంటి పరిస్థితిలో, ఆమె మరొక పురుషుణ్ణి వివాహమాడకముందు తిరిగి తన మొదటి భర్తతో వివాహం కూడా చేసుకోజాలదు. ఇది ఫాతిమబిన్తెఖైస్ (ర.'అన్హా) కు జరిగిన విషయంతో స్పష్టమవుతుంది. ఆమె భర్త ఆమెకు మూడవసారి విడాకులిచ్చిన తరువాత ఆమె తన భర్త ఇంటి నుండి వెళ్ళిపోవటానికి నిరాకరించింది. అప్పుడావిషయం దైవప్రవక్త ('స'అస) దగ్గరికి వస్తే అతనామెను, తన భర్త ఇల్లు విడవమని ఆజ్ఞాపించారు, (అ'హ్మద్, నసాయీ').

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now