కురాన్ - 19:37 సూరా సూరా మరియం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

37
فَٱخۡتَلَفَ ٱلۡأَحۡزَابُ مِنۢ بَيۡنِهِمۡۖ فَوَيۡلٞ لِّلَّذِينَ كَفَرُواْ مِن مَّشۡهَدِ يَوۡمٍ عَظِيمٍ

Transliteration: (Fakhtalafal ahzaabu min bainihim fawailul lillazeena kafaroo min mashhadi Yawmin 'azeem)

తరువాత విభిన్న (క్రైస్తవ) వర్గాల వారు (ఈసాను గురించి) పరస్పర అభిప్రాయభేదాలు నెలకొల్పుకున్నారు. కావున ఈ సత్యతిరస్కారులకు ఆ మహా దినపు దర్శనం వినాశాత్మకంగా ఉంటుంది.[1]

సూరా సూరా మరియం ఆయత 37 తఫ్సీర్




[1] యూదులు 'ఈసా ('అ.స.)ను మాంత్రికుడు, యూసుఫ్ నజ్జార్ కుమారుడు అన్నారు. ప్రొటెస్టెంట్ క్రైస్తవులు అతనిని అల్లాహ్ (సు.తా.) కుమారుడు అన్నారు. కేథోలిక్ తెగవారు అతను ముగ్గురు దైవాలలో, అల్లాహ్ (సు.తా.) జిబ్రీల్ ('అ.స.) మరియు 'ఈసా ('అ.స.) ముగ్గురిలో మూడవవారు అన్నారు. ఆర్థోడాక్స్ తెగవారు అతనిని స్వయం దేవుడు (God అల్లాహ్) అన్నారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్ మరియు అయ్ సర్ అత్-తఫాసీర్)

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now