కురాన్ - 38:72 సూరా సూరా సాద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

72
فَإِذَا سَوَّيۡتُهُۥ وَنَفَخۡتُ فِيهِ مِن رُّوحِي فَقَعُواْ لَهُۥ سَٰجِدِينَ

Transliteration: (Fa-iza sawwaituhoo wa nafakhtu feehi mir roohee faqa'oo lahoo saajideen)

ఇక ఎప్పుడైతే, నేను అతని సృష్టిని పూర్తి చేసి అతనిలో నా (తరఫు నుండి) ఆత్మను (జీవాన్ని) ఊదుతానో అప్పుడు, [1] మీరు అతని ముందు సాష్టాంగం (సజ్దా)లో పడిపోండి.[2]

సూరా సూరా సాద్ ఆయత 72 తఫ్సీర్




[1] రూహున్: ఆత్మ (ప్రాణం), దీని యజమాని కేవలం అల్లాహ్ (సు.తా.) మాత్రమే. ఆత్మ అనేది అల్లాహ్ (సు.తా.) తప్ప ఇతరుల ఆధీనంలో లేదు. అది (ఆత్మ) ఊదగానే మానవుడు చలనంలోకి వస్తాడు. మానవునిలో అల్లాహ్ (సు.తా.) ఆత్మను ఊదాడు. ఇది ఎంత గౌరవప్రదమైన విషయం. [2] ఈ సజ్దా గౌరవార్థం చేసిందే. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞను శిరసావహించటానికి. ఇది ఆరాధనగా చేసిన సజ్దా కాదు. దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) సున్నత్ లో గౌరవార్థం చేసే సజ్దా కూడా హరాం చేయబడింది. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం : 'ఒకవేళ ఇది అనుమతిచబడి ఉంటే నేను స్త్రీకి తన భర్తకు సజ్దా చేసే అనుమతి ఇచ్చేవాడిని.' (తిర్మిజీ', అల్బానీ ప్రమాణీకం).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now