కురాన్ - 58:22 సూరా సూరా ముజాదిలా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

22
لَّا تَجِدُ قَوۡمٗا يُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ يُوَآدُّونَ مَنۡ حَآدَّ ٱللَّهَ وَرَسُولَهُۥ وَلَوۡ كَانُوٓاْ ءَابَآءَهُمۡ أَوۡ أَبۡنَآءَهُمۡ أَوۡ إِخۡوَٰنَهُمۡ أَوۡ عَشِيرَتَهُمۡۚ أُوْلَـٰٓئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ ٱلۡإِيمَٰنَ وَأَيَّدَهُم بِرُوحٖ مِّنۡهُۖ وَيُدۡخِلُهُمۡ جَنَّـٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ رَضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُۚ أُوْلَـٰٓئِكَ حِزۡبُ ٱللَّهِۚ أَلَآ إِنَّ حِزۡبَ ٱللَّهِ هُمُ ٱلۡمُفۡلِحُونَ

Transliteration: (Laa tajidu qawmany yu'minoona billaahi wal yawmil aakhiri yuwaaaddoona man haaaddal laaha wa Rasoolahoo wa law kaanooo aabaaa'ahum aw abnaaa'ahum aw ikhwaa nahum aw 'asheeratahum; ulaaa'ika kataba fee quloobihi mul eemaana wa ayyadahum biroohimminhu wa yudkhilu hum jannatin tajree min tahtihal anhaaru khaalideena feehaa; radiyal laahu 'anhum wa radoo 'anhu; ulaaa 'ika hizbul laah; alaaa inna hizbal laahi humul muflihoon)

అల్లాహ్ మరియు పరలోకాన్ని విశ్వసించే జనులలో, అల్లాహ్ మరియు ఆయన సందేశహరుణ్ణి వ్యతిరేకించేవారితో స్నేహం చేసుకునే వారిని నీవు పొందలేవు![1] ఆ వ్యతిరేకించేవారు, తమ తండ్రులైనా లేదా తమ కుమారులైనా లేదా తమ సోదరులైనా లేదా తమ కుటుంబం వారైనా సరే![2] అలాంటి వారి హృదయాలలో ఆయన విశ్వాసాన్ని స్థిరపరచాడు. మరియు వారిని తన వైపు నుండి ఒక ఆత్మశక్తి (రూహ్) ఇచ్చి బలపరిచాడు. మరియు వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయన పట్ల ప్రసన్నులవుతారు. ఇలాంటి వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. గుర్తుంచుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ పక్షం వారే సాఫల్యం పొందేవారు.

సూరా సూరా ముజాదిలా ఆయత 22 తఫ్సీర్




[1] చూడండి, 3:28, 9:24 మొదలైనవి. [2] చూడండి, 8:67.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now