కురాన్ - 60:10 సూరా సూరా ముమ్తహినా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

10
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا جَآءَكُمُ ٱلۡمُؤۡمِنَٰتُ مُهَٰجِرَٰتٖ فَٱمۡتَحِنُوهُنَّۖ ٱللَّهُ أَعۡلَمُ بِإِيمَٰنِهِنَّۖ فَإِنۡ عَلِمۡتُمُوهُنَّ مُؤۡمِنَٰتٖ فَلَا تَرۡجِعُوهُنَّ إِلَى ٱلۡكُفَّارِۖ لَا هُنَّ حِلّٞ لَّهُمۡ وَلَا هُمۡ يَحِلُّونَ لَهُنَّۖ وَءَاتُوهُم مَّآ أَنفَقُواْۚ وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ أَن تَنكِحُوهُنَّ إِذَآ ءَاتَيۡتُمُوهُنَّ أُجُورَهُنَّۚ وَلَا تُمۡسِكُواْ بِعِصَمِ ٱلۡكَوَافِرِ وَسۡـَٔلُواْ مَآ أَنفَقۡتُمۡ وَلۡيَسۡـَٔلُواْ مَآ أَنفَقُواْۚ ذَٰلِكُمۡ حُكۡمُ ٱللَّهِ يَحۡكُمُ بَيۡنَكُمۡۖ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ

Transliteration: (Yaaa ayyuhal lazeena aamanoo izaa jaaa'akumul mu'minaatu muhaajiraatin famtahinoo hunn; Allaahu a'lamu bi eemaani hinn; fa in 'alimtumoo hunna mu'minaatin falaa tarji'oo hunna ilal kuffaar; laa hunna hillul lahum wa laa hum yahilloona lahunna wa aatoohum maa anfaqoo wa laa junaaha 'alaikum an tankihoohunna izaaa aataitumoohunna ujoorahunn; wa laa tumsikoo bi 'isamil kawaafir; was'aloo maaa anfaqtum walyas'aloo maaa anfaqoo; zaalikum hukmul laahi yahkumu bainakum; wallaahu 'aleemun hakeem)

ఓ విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు, మీ వద్దకు వలస వచ్చినపుడు, వారిని పరీక్షించండి.[1] అల్లాహ్ కు వారి విశ్వాసం గురించి బాగా తెలుసు. వారు వాస్తవంగా విశ్వసించిన వారని మీకు తెలిసినప్పుడు, వారిని సత్యతిరస్కారుల వద్దకు తిరిగి పంపకండి. (ఎందుకంటే) ఆ స్త్రీలు వారికి (సత్యతిరస్కారులకు) ధర్మసమ్మతమైన (భార్యలు) కారు మరియు వారు కూడా ఆ స్త్రీలకు ధర్మసమ్మతమైన (భర్తలు) కారు. కాని, వారు (సత్యతిరస్కారులు), వారికిచ్చిన (మహ్ర్) మీరు వారికి చెల్లించండి మరియు వారికి వారి మహ్ర్ ఇచ్చిన తరువాత, ఆ స్త్రీలను వివాహమాడితే మీకు ఎలాంటి దోషం లేదు. మరియు మీరు కూడా సత్యతిరస్కారులైన స్త్రీలను మీ వివాహబంధంలో ఉంచుకోకండి. (అవిశ్వాసులుగా ఉండి పోదలచిన) మీ భార్యల నుండి మీరు ఇచ్చిన మహర్ అడిగి తీసుకోండి.[2] (అలాగే అవిశ్వాసులను, విశ్వాసులైన తమ) భార్యల నుండి మహ్ర్ అడిగి తీసుకోనివ్వండి.[3] ఇది అల్లాహ్ తీర్మానం. ఆయన ఈ విధంగా మీ మధ్య తీర్పు చేస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

సూరా సూరా ముమ్తహినా ఆయత 10 తఫ్సీర్




[1] 6వ హిజ్రీలో జరిగిన 'హుదైబియా ఒప్పందంలో ఏ వ్యక్తి అయినా మక్కా నుండి మదీనాకు వెళ్ళపోతే ఆ వ్యక్తిని మక్కావారు - తిరిగి ఇవ్వమని అడిగితే - ఇవ్వాలి అనే షర్త్ ఉండింది. కాని అందులో స్త్రీపురుషుల విషయం స్పష్టంగా లేదు. దానిని బట్టి ముస్లింయి మదీనాకు వచ్చిన స్త్రీలను వాపసు ఇవ్వండి అని మక్కా ముష్రిక్ లు కోరగా, ఈ ఆయత్ అవతరింప జేయబడింది. వారు కేవలం ఇస్లాం కొరకే వచ్చారని నిర్ధారణ చేసుకోవాలని ఆజ్ఞ ఉంది. యుక్త వయస్కుడైన పురుషునికి లేక స్త్రీకి తనకు నచ్చిన ధర్మాన్ని అనుసరించే హక్కు ఉంది. ఈ ఆయత్ అవతరించక ముందు చాలా మంది ముస్లింల భర్తలు లేక భార్యలు ముష్రికులుగా ఉండేవారు. ఉదాహరణకు దైవప్రవక్త ('స'అస) బిడ్డ 'జైనబ్ (ర. 'అన్హా) భర్త అబుల్ 'ఆ'స్ బిన్ రబీ'అ, ముష్రిక్ గా ఉండేవారు. అతను బద్ర్ యుద్ధపు కొంత కాలం తరువాత ఇస్లాం స్వీకరించి మదీనాకు వచ్చారు. [2] 'ఉమర్ (ర'ది.'అ.) గారి ఇద్దరు భార్యలు ముష్రికులు. ఈ ఆయత్ అవతరణ తరువాత అతను వారికి విడాకులిచ్చారు. [3] ఒక స్త్రీ ఇస్లాం స్వీకరించగానే ఆమె ముష్రిక్ భర్తతో ఆమె వివాహబంధం వెంటనే తెగిపోతుంది. అతడు ఆమె నుండి తన మహ్ర్ వాపసు తీసుకోవచ్చు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now