కురాన్ - 60:8 సూరా సూరా ముమ్తహినా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

8
لَّا يَنۡهَىٰكُمُ ٱللَّهُ عَنِ ٱلَّذِينَ لَمۡ يُقَٰتِلُوكُمۡ فِي ٱلدِّينِ وَلَمۡ يُخۡرِجُوكُم مِّن دِيَٰرِكُمۡ أَن تَبَرُّوهُمۡ وَتُقۡسِطُوٓاْ إِلَيۡهِمۡۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُقۡسِطِينَ

Transliteration: (Laa yanhaakumul laahu 'anil lazeena lam yuqaatilookum fid deeni wa lam yukhrijookum min diyaarikum an tabarroohum wa tuqsitooo ilaihim; innal laaha yuhibbul muqsiteen)

ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిషేధించలేదు. [1] నిశ్చయంగా, అల్లాహ్ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు[2].

సూరా సూరా ముమ్తహినా ఆయత 8 తఫ్సీర్




[1] ఎలాంటి సత్యతిరస్కారులతో సత్ప్రవర్తనతో వ్యవహరించాలో వారి వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఒకటి: మీరు కేవలం ముస్లింలు అయినందుకు మీతో శత్రుత్వం వహించి మీతో పోరాడని వారితో, రెండు: మిమ్మల్ని మీ ఇల్లూ వాకిలి విడిచి పొమ్మని బవలంతం చేయని వారితో! మూడు: మీకు విరుద్ధంగా ఇతర సత్యతిరస్కారులకు సహాయపడని వారితో! [2] చూదైవప్రవక్త ('స'అస) ను అస్మా బిన్తె అబూ బక్ర్ సిద్ధీఖ్ (ర'అన్హా), ముష్రిక్ రాలైన తన తల్లితో ఎలా వ్యవహరించాలని అడిగారు. అతను ('స'అస) ఇలా జవాబిచ్చారు: 'నీ తల్లితో రక్త సంబంధాన్ని ఉంచుకో!' ('స'హీ 'హ్ ముస్లిం, 'స'హీ 'హ్ బు'ఖారీ) మరొక విషయం ఏమిటంటే బంధువులు కాని సత్యతిరస్కారులతో కూడ న్యాయంగా ప్రవర్తించాలి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now