కురాన్ - 66:10 సూరా సూరా తహ్రీమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

10
ضَرَبَ ٱللَّهُ مَثَلٗا لِّلَّذِينَ كَفَرُواْ ٱمۡرَأَتَ نُوحٖ وَٱمۡرَأَتَ لُوطٖۖ كَانَتَا تَحۡتَ عَبۡدَيۡنِ مِنۡ عِبَادِنَا صَٰلِحَيۡنِ فَخَانَتَاهُمَا فَلَمۡ يُغۡنِيَا عَنۡهُمَا مِنَ ٱللَّهِ شَيۡـٔٗا وَقِيلَ ٱدۡخُلَا ٱلنَّارَ مَعَ ٱلدَّـٰخِلِينَ

Transliteration: (Darabal laahu masalal lillazeena kafarum ra ata Noohinw wamra ata Loot, kaanataa tahta 'abdaini min 'ibaadinaa saalihaini fakhaanataahumaa falam yughniyaa 'anhumaa minal laahi shai anw-wa qeelad khulan naara ma'ad Daakhileen)

సత్యతిరస్కారుల విషయంలో అల్లాహ్ నూహ్ భార్య మరియు లూత్ భార్యల ఉదాహరణలను ఇచ్చాడు[1]. ఆ ఇద్దరు స్త్రీలు మా సత్పురుషులైన మా ఇద్దరు దాసుల (వివాహ) బంధంలో ఉండిరి. కాని ఆ ఇద్దరు స్త్రీలు వారిద్దరిని మోసగించారు. కావున వారిద్దరు, ఆ ఇద్దరు స్త్రీల విషయంలో అల్లాహ్ ముందు (పరలోకంలో) ఏ విధంగాను సహాయపడలేరు[2]. మరియు (తీర్పు దినమున) వారితో: "నరకాగ్నిలో ప్రవేశించే వారితో సహా, మీరిద్దరు స్త్రీలు కూడా ప్రవేశించండి!" అని చెప్పబడుతుంది.

సూరా సూరా తహ్రీమ్ ఆయత 10 తఫ్సీర్




[1] లూ'త్ ('అ.స.) భార్య విషయానికై చూడండి 7:83 మరియు 11:81. నూ'హ్ ('అ.స.) భార్యను గురించి కేవలం ఇక్కడ మాత్రమే చెప్పబడింది. వీరిద్దరు చెడునడవడిక, చెడుచరిత్రవారు కారు, కానీ సత్యతిరస్కారులు. [2] సత్యతిరస్కారులు దగ్గరి బంధువులైనా వారితో సంబంధాలు తెంపుకోవాలి. చూడండి, 11:46.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now