కురాన్ - 66:12 సూరా సూరా తహ్రీమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

12
وَمَرۡيَمَ ٱبۡنَتَ عِمۡرَٰنَ ٱلَّتِيٓ أَحۡصَنَتۡ فَرۡجَهَا فَنَفَخۡنَا فِيهِ مِن رُّوحِنَا وَصَدَّقَتۡ بِكَلِمَٰتِ رَبِّهَا وَكُتُبِهِۦ وَكَانَتۡ مِنَ ٱلۡقَٰنِتِينَ

Transliteration: (Wa Maryamab nata 'Imraanal lateee ahsanat farjahaa fanafakhnaa feehee mir roohinaa wa saddaqat bi kalimaati Rabbihaa wa Kutubihee wakaanat minal qaaniteen (End Juz 28))

మరియు ఇమ్రాన్ కుమార్తె మర్యమ్[1] ను (కూడా ఉదాహరణగా పేర్కొన్నాడు) ఆమె తన శీలాన్ని కాపాడు కున్నది. మరియు మేము ఆమెలోకి మా (తరఫు నుండి) జీవం (ఆత్మ) ఊదాము[2]. మరియు ఆమె తన ప్రభువు సమాచారాలను మరియు ఆయన గ్రంథాలను, సత్యాలని ధృవపరిచింది మరియు ఆమె భక్తిపరులలో చేరిపోయింది[3].

సూరా సూరా తహ్రీమ్ ఆయత 12 తఫ్సీర్




[1] చూడండి, 3:33. [2] చూడండి, 21:91. [3] స్త్రీలందరిలో 'ఖదీజా బింత్ 'ఖువైలిద్, ఫాతిమా, మర్యం మరియు ఫిర్'ఔన్ భార్య ఆసియహ్ (ర'ది.'అన్హుమ్)లు అతి ఉత్తమమైన వారు. (ముస్నద్ అ'హ్మద్) మరొక 'హదీస్' : చాలా మంది పురుషులు పరిపూర్ణతకు చేరుకున్నారు. కాని స్త్రీలలో కేవలం ఫిర్ఔన్ భార్య ఆసియహ్ మరియు 'ఇమ్రాన్ కూతురు మర్యం (ర'ది.'అన్హుమ్)లు పరిపూర్ణతకు చేరుకున్నారు. మరియు 'ఆయి'షహ్ (ర.'అన్హా) యొక్క ఔన్నత్యం ఇతర స్త్రీలపై స'రిద్ కు ఇతర ఆహారం పై ఉన్నట్లు ఉంది.('స'హీ'హ్ బు'ఖారీ).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now